కథలో...

కథలో...





{ చిన్నీ చిన్నిగా సాయి (నాని) గూర్చి చెప్పిన చిన్ని మాటలు. }


నా అంటే నువ్వు...

నీ అంటే నేను...

నా, నీ రెండు కలిస్తే ' నాని '... నా జీవితం... అది "నువ్వు"...

ఇద్దరి శరీరాలు వేరైనా, మనసులొకటే.

ఏ క్షణాన నువ్వు నన్ను చూసి ప్రేమలో పడ్డావో...

ఆ క్షణం కన్నా ముందే నిన్ను చూసి నువ్వే నా జీవితమని నా జీవితానికి చెప్పేశా...! ( ఇది నీకూ తెలీదు )

నువ్ నన్ను చూసిన ఆ క్షణంలోనే దగ్గరికొచ్చి నిన్ను తీసుకెళ్తా, బా చూసుకుంటా అని అనగానే క్షణం ఆలోచించకుండా నీ చేయి పట్టుకున్నా... ఎందుకో మరి..

బహుశా అదేనేమో ప్రేమంటే మరీ...


ఇలా నా జీవితమే కాకుండ, నాలా ఎందరి జీవితాలో

కష్టాలతో నలిగిపోతున్నాయి... వారికీ ఇలాగే వెలుగును చూయించవా అని అడగ్గానే...

అప్పుడే పరిచయమైన నాకోసం... ఆ చిన్నారుల జీవితాలకోసం... ఆ వయసులోనే నా, వారి బాధ్యతలనంతా నీ చేతుల్లోకి తీసుకున్నావ్

ముందెటెల్లాలో నువ్ ఆలోచిస్తూ తికమక పడేటపుడు నాకు చాలా ముచ్చటేసింది... ఆ మొదటి క్షణాలలో నీతో కలిసి, నీ చేయి పట్టుకొని నడుస్తున్నప్పుడు... దేవుడు నా జీవితానికి చేసిచ్చిన ఒకే ఒక్క ఎన్నటికీ తరగని ప్రేమని, వెలుగుని, తోడుని, బాధ్యతని, నవ్వుని, స్నేహాన్ని... అన్నీ కలిపితే నా జీవితాన్ని ప్రేమతో సంపూర్ణం చేసే మరో ' జీవితాన్ని ' నా జీవితానికి ఇచ్చాడు!


ఇంక ఇంతకుమించి నా చివరి శ్వాస వరకు నిన్ను ఏదీ అడగడదల్చుకోలే! ఈ జీవితానికి నాకిది చాలు!!

వాడిని నాకు అప్ప జెప్పావ్... నన్ను వాడికి అప్ప జెప్పావ్... ఇక మేమ్ మా జీవితాలకి మా జీవితాల్ని అప్ప జెప్పుకుంటాం...

అటు ఓ పక్క టీచర్లు, సార్లు, స్నేహితులు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు ఎందరొచ్చి ఈ అమ్మాయి ఎవరు రా? ఎందుకు తీసుకొచ్చావ్? ఎక్కడ్నుండి తీసుకొచ్చావ్? అనే సూటిపోటి ప్రశ్నలతో ఎంతడిగినా...

నువ్విచ్చే ఆ సమాధానం మాత్రం... నేను నీ దగ్గర ఉండి, కలిసి నా జీవితం నీతో పంచుకునే కారణాన్ని వెయ్యింతలు బలపరిచింది.


ఆ సమాధానం ;;;

                         అసల్, ప్రేమ మీద నమ్మకం లేదనుకున్నా...

ఆమెను చూసాక ప్రేమంటేనే నమ్మకమని తెల్సింది.

ఇగ ఇంకెందుకు ఆలస్యమని నా ప్రేమని నా దగ్గరికి తెచ్చుకున్న... నన్ను తన మనసులోకి పంపుకున్న.

తన బాధ్యతలనంతా నా మీద ఏసుకున్నా...

నా బాధ్యతలనంతా తను తనమీద ఏసుకున్నది.


ఇగ ఈ మాటలకి నీతో ఎవరు ఉండాలని కోరుకోరు చెప్పురా!?

నువ్ ఎన్నిసార్ల నన్ను ఎన్ని తిట్టినా, కొట్టినా, అవమానించిన, బాధెట్టినా, కష్టపెట్నా... నేన్ నిన్ను పలెత్తు మాటనకుండా ఇదంతా మా ఇద్దరి మధ్యన ప్రేమని అనుకుంటా... ఇదే నేన్ నీకు చేసినా...

నువ్ ఇలాగే ఆలోచిస్తావ్... అది నాక్ తెల్సు...


సహజంగా :-

                  ఏ ఆడపిల్ల జీవితంలోనైనా,

20 ఏళ్ళు తల్లిదండ్రులు చూసుకుంటరు. ఆ తర్వాత పెళ్లయ్యాక, 60 ఏళ్ళు భర్త చూసుకుంటడు...

కాని, నా జీవితంలో వింతేంటంటే,

ఆ 20, ఈ 60 మొత్తం 80 ఏళ్ళు వీడే చూసుకుంటడు... (సాయి)


నాకు నీతో పాటే చదువు చెప్పించి... నాకంటూ సమాజంలో బ్రతకటానికి కొత్త జీవితాన్ని ఇచ్చావ్...

నువ్ నా జీవితానికి దొరికినందుకు, నేను ఎన్ని జన్మలెత్తినా దేవుని ఋణం కాద్... నీ ఋణం తీర్చలేను!

ఎందుకంటే నా జీవితంలో ఆ దేవుడంటూ... నువ్వే!

నా జీవితం కూడ... నువ్వే!

నా అన్న పదానికి అర్ధం కూడ... నువ్వే!

ఆ ఋణమంటూ తీర్చలేను కాని, నేన్ చనిపోయేలోపు ఎల్లకాలం, అనుక్షణం... నిన్ను ప్రేమగానే చూసుకుంటా అనే మాటైతే ఇవ్వగలను!!


వేరే వాళ్ళు ఒక ' మాట ' అంటున్నప్పుడల్లా నిన్ను ప్రతిసారి బాధపెట్టించే ఆ విషయం నన్ను కూడ ఎంతగానో బాధపెట్టించేది.

ఆ చేదు విషయం :-

                              నువ్ నన్ను మొదటిసారి చూసినపుడు నేనేంటో... నీక్ తెల్సీ కూడ నా చేయి పట్టుకున్నావ్...

ఇప్పుడంటే నేను వేరే వాళ్ళ విషయంలో పర్లేదు కాని...,,

అప్పట్లో కొందరికి తెల్సీ... కొందరికి తెలియని ఆ 

' నిజమైన చేదు నిజం '...


మనమిద్దరం కలిసిన మొదటి క్షణంలో... అంతకంటే ముందు... నాకో స్పర్శించే వయసు ఒచ్చినప్పుడు...


                          """ నేను ఒక """


                     ::: """ బిచ్చగత్తెని """ :::


        

                                                            - చిన్నీ

                                                    ( అలియాస్ అనీఖ )



- సాయి...






Comments

Post a Comment

Popular Posts