One Small Message

                        ఒకచిన్న సందేశం


ఒక కారణం పై పుట్టి, మరో కారణం పై బ్రతుకుతూ...

ఒకదాన్ని సాదించేందుకు అవతరించి,

అనవసరమైనటువంటి పై సాధించే బ్రతుకు...

బ్రతికేవారు ఎలాగోలా ఎల్ల తీస్తున్నారు? కానీ తీయనివారి పరిస్థితి ఏంటి?

ఆనందం, కష్టం, శ్రమ, ప్రేమ, అనురాగం, తెలివి, స్నేహం వంటి మంచి గుణాలన్నిటీని వదిలేసి,

ఈర్ష్య, అసూయ, కఠినత్త్వం, స్వార్థం వంటి చెడు గుణాలతో ఈదే బ్రతుకు...

ఒక చోట మనిషి మరణిస్తే తీసుకపోవడానికి వచ్చి కూడా కాస్త ధనరసం కనిపిస్తే చాలు, దాని వైపు ఎగేసుకుంటూ వెళతారు. ఎందుకో మరి? 

అంటే,  దాని వెనక మీరు పరిగెడుతున్నారా? మీ వెంట అది పరిగెడుతుందా?

ఎందుకివన్ని చెప్పండి? ఇదంతా అనవసరమైన బ్రతుకు!

ఎన్ని సార్లు మొత్తుకున్నా మారని బ్రతుకులు?ఎంత మొర పెట్టుకున్న జీవస్త్వం లా ఉండడమే తప్ప మార్పు కోసం ఏ మాత్రం ప్రయత్నించని బ్రతుకులు?

బ్రతికెందుకు... చస్తే మంచిది గానీ...!

నిస్వార్థంగా, మన జీవితాన్ని సంతోషంగా గడపకుండా ఎదుటి వాళ్ళ కోసం పరితపిస్తారెందుకు?

మీ కుటుంబ స్థితిని మార్చే పని పక్కనపెట్టేసి, ఇతరులను ఎలా పైకి తీసుకురావాలో ఆలోచిస్తారెందుకు? అదే పనిగా పెట్టుకున్నారెందుకు?

నేను మీకు చెప్పేంత వాన్ని కాకపోవచ్చు కానీ మిమ్మల్ని చూస్తే నన్ను నేను మార్చుకుంటానేమోనని భయం కలుగుతుంది?తప్పు అనిపించచ్చు కానీ, ఇదే పచ్చి నిజం!

నిజమైన జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఇలా కన్నేయండి 👀

ఎవ్వరి గురించి పట్టించుకోకుండా, ఒక మీ కుటుంబం, మీరు. ముఖ్యంగా, "నువ్వు" ఎలా నిజమైన జీవితం బ్రతకాలో నేర్చుకో. ఆ తరువాతే అన్నీ. అన్నంటే అన్నీ.

*కుదిరితే సహాయం చేయండి, కాని నష్టం తలపెట్టకండి.

*వీలైతే నవ్వించండి, కాని ఎవ్వరిని బాధపెట్టకండి.

*మీరు బ్రతుకుతూ వేరే వాళ్ళనూ బ్రతికించండి,

కాని దయచేసి వారి జీవితాలను లాక్కోక్కండి.

*మిమ్మల్ని మీరు మార్చుకొని,ఇతరులను మార్చేందుకు ప్రయత్నించండి. కాని మీరు మారకుండా, వారినీ మార్చకుండా,

చెడు దిశలో మర్లించడానికి ఒడి కట్టకండి.

*వీలైతే నలుగురికి ఉపయోగపడే బ్రతుకులా బ్రతకండి.

                                 {లేదంటే}

మీ చావు మీరు చావండి. అంతే తప్ప ఇతరులను చెడపకండి,

చంపకండి!

                                                                  - సాయి ✍️




Comments

Post a Comment

Popular Posts