Life

                                    జీవితం 



ఒక స్టేషన్ లో ట్రైన్ ఎక్కి ఇంకో స్టేషన్ లో దిగేంత వరకు, మనం చేసే ఈ చిన్న ప్రయాణం లాంటిదే ఈ మన పెద్ద జీవితం.

మరి ఇంత చిన్న ప్రయాణంలో నలుగురితో నవ్వుతూ గడపకుండా,

ఊహ తెలిసినప్పటినుండి స్కూల్లో సీటు కోసం అంత ఆరాటం ఎందుకు?

సీటొచ్చాక ఫస్ట్ ర్యాంక్ ల కోసం ఆ పోరాటం ఎందుకు? 

అన్నీ నాకే కావాలనే స్వార్థం ఎందుకు?

కావాలనుకున్నది రాకపోతే వచ్చే ఆ కోపమెందుకు?


అన్నీటి మీద నీ కళ్ళెందుకు? కళ్ళకు కనబడింది నీది కాకపోతే ఆ కుళ్లేందుకు? 

పనికివచ్చే పనులు పక్కన పెట్టేసి, పనికిమాలిన పగలెందుకు? పనికిరాని కలలెందుకు?

ఒకరోజు ఖచ్చితంగా చనిపోతామని తెలిసినప్పుడు, ఇలా ప్రతిరోజూ చస్తూ బ్రతకడమెందుకు? 

నలుగురితో సంతోషంగా బ్రతుకుతూ...వారినీ బ్రతికిస్తూ ఉంటే...ఇది మన జీవితానికి... సరిపోదూ... హా?

                                                                       - Unknown 


Comments

Popular Posts