My hero
కవిత
[భావన తెలుపలేనిది]
నాన్న,
నన్ను చిన్నప్పటినుండి ఏ కష్టం లేకుండా పెంచావు.
కాని నీ కష్టాన్ని నేను ఏ రోజు అర్థంచేసుకోలేదు.
నాకు ఇది కావాలి అనే లోపే నా ముందర,
తెచ్చిపెట్టి నా కోరికను ఇట్టే నెరవేరుస్తావు.
నా చదువుల్లో, నా ఉపాధ్యాలుకన్నా
ఎంతో తెలివితో నా పరిష్కారాలన్నిటీని
సులువుగా పరిష్కరించి నన్ను విజ్ఞానవంతుణ్ణి చేసావు.
నీ విలువైన సమయాన్ని కేవలం నా కోసం వృధా చేసి,
నీ ఒక సమయపాలనని నా ముందర చాటావు.
నీ ఒక ఋణం తీర్చాలంటే నేను,
వంద జన్మలెత్తినా తీర్చలేను.
మన కుటుంబ భారాన్ని మోస్తూ, లాలిస్తూ, అలరిస్తూ,
మా ముందటనే సంతోషంగా జీవిస్తున్నావు.
కాని నీ మనసులో వున్నా ఆ తీర్చలేని బాధను,
మేము ఏనాటికి గుర్తించలేము, ఎన్నటికీ తీర్చలేము.
అయినా, నీ గురించి
ఎంత చెప్పినా, ఎంత రాసిన, ఎంత చేసిన, "ఏమీ లాభం?"
ఎంత రాసిన వట్టికే! ఎన్ని చేసిన ఉట్టికే!
ఇట్లు,
మీ తనయుడు,
సాయి ✍️
Comments
Post a Comment