Real form
అసలు రూపం
కాస్త డబ్బులు రాగానే స్వార్థం. ఇతరులు విలువైంది కొంటె అసూయ. తనకి దక్కంది పరులకు దక్కితే ఈర్ష్య. కులంకు చెందకపోతే అసమానతం.
అన్నీ తమకే తెలిసినప్పుడు చెప్పుకోలేని గర్వం. అదే పరాయివాళ్ళకి తెలిస్తే ఓర్వలేనితం. ఇతరులు ఇస్తే తీసుకోవచ్చు కాని తన దగ్గరున్న సొమ్ముని బయటపెట్టరాదు. సహాయం అడిగిన వారి చేతుల్లో మాత్రం అసల్కే పెట్టరాదు.
అన్నీ తనకే దక్కాలి, ఏదున్నా తనకే చెందాలి. అది మాత్రం పరుల దరి చేరకూడదు అనే నీచపు బుద్ధి.
సంతోషం, ఆనందం, ఉత్సాహం... ఏ భావాలు కలిగిన, ఏమొచ్చిన బయటపెట్టద్దు.
చివరికి అన్నీ ఉన్నా ఏమీ లేనట్టే. అందరూ ఉన్నా తనతో ఎవ్వరూ లేనట్టే.
మరింకెందుకు చెప్పండి? ఈ గుణాలు, భావాలు, లక్షణాలు.
మంచి చేయకున్నా పర్వాలేదు, కాని చెడును తలపెట్టకండి.
మీకు అన్నీ దక్కాలని కోరుకోండి తప్పులేదు, కాని పరులకు దక్కద్దు, చిక్కద్దు అలా ఎన్నటికీ అనుకోవద్దు.
సహాయం చేయకున్నా పర్వాలేదు లేదు, కాని ఇతరుల పొట్టని కొట్టకండి.
మీరు స్వయంగా ఏమ్ ఇవ్వకున్నా ఏమి కాదు,కాని ఇతరులు ఇచ్చినప్పుడు దయచేసి తిరిగి ఇచ్చేయండి.
ప్రకృతి, సృష్టి మనిషిని పుట్టించింది వారిలో ఉన్న కొత్త కోణాలను వెలికి తీయాలని. ఒక కొత్త అనుబంధం బలపడాలని. ఎప్పుడూలేని ఓ వింత హరివిల్లును చూసేందుకు. కాని మనమేం చేస్తున్నాం? అంతా తారుమారు చేస్తున్నాం!
దయచేసి ఈ ఆటలన్నీ ఆపేయండి. మనిషి మనీషిగా బ్రతకకుండా, ఒక నిజమైన, స్వచ్ఛమైన జీవంగా బ్రతకండి. ఇతరులను అలాగే బ్రతకనివ్వండి.
ఇట్లు,
మీ శ్రేయోభిలాషి,
సాయి ✍🏻
Lets just be who we really ate. Live a real lyf..
ReplyDeleteGood keep it up...
Welldone
Nice sai
ReplyDelete