That's all I wrote...!
తెలిసింది రాసాను అంతే.... !!!
@లవ్... ఈ పదం వినగానే మన మదిలో ఏదో తెలియని ఆనందం. అదో వింత అనుభూతి. ఆలోచనలన్ని ఒక్కసారిగా ఎక్కడికో పరిగెడుతాయి. ఒకదాని తర్వాత మరొకటన్నట్టు...
జ్ఞాపకాల దొంతరలో తేలియాడిపోతుంటాము. ఒకరి పై ఇంకొకరికి లవ్ పుట్టిన్నప్పటికీ అది వారు ప్రేమిస్తున్న వారికి తెలియచేయడంలో చాలా తంటాలు పడుతుంటారు. తాను లవ్ చేస్తున్నానన్న విషయం తన ప్రియురాలికి చెప్పడానికి రోజుల కొద్ది ప్రిపేర్ అయ్యే వాళ్లు ఉంటారు. తన భావాలను వ్యక్తం చేయడానికి పడే ఆ టెన్షన్ వేరు...ఇలాంటి విషయాల్లో ఒక్కొక్కరు ఒక్కో పద్దతిని ఎంచుకుంటారు. అందరికంటే తను స్టైల్ భిన్నంగా ఉండాలనుకునేవారూ ఉంటారు...
రోజూ కనబడినప్పుడు హాయ్...! అన్నంత ఈజీ గా "లవ్ యూ" అని చెప్పలేం. అయితే, రోజా పువ్విచ్చో... మధురమైన ఒక గిఫ్ట్ అందజేసో....నేరుగా చెప్పలేక వాట్సాప్ లో తిరకాసు భాషలో చెప్పడమో...ఏ స్టైల్ అయినా లవ్వు... లవ్వే... అందులోని మజానే వేరు...
కాని ఒక్కసారి ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే కొన్ని కష్టాలు... ఒప్పుకుంటే కొన్ని కష్టాలు...
ఒప్పుకుంటే మంచిగానే రోజులు-రోజులు ప్రేమించుకుంటారు, జీవితాన్ని అప్పటివరకు సంతోషంగా గడిపేస్తారు. ఒకవేళ పెద్దలు ఒప్పుకోకపోతే వారిని ఎదిరించి పెండ్లి చేసుకుంటారు, ఎదిరించే ధైర్యం లేకపోతే కొందరు చనిపోయేవారు ఉంటారు, మరికొందరు మధ్యలోనే దిగిపోయేవారు ఉన్నారు. ఒకవేళ అన్నీ కుదిరి పెద్దలే మనం పెళ్లి చేస్తే,
ఇంకేం కావాలండి మనకి... అది చాలు... మన జీవితానికి! ప్రేమించిన అమ్మాయి ఒకవేళ ఒప్పుకోకపోతే, కొంచం బాధ ఉంటుంది. ఆ తరువాత దుఃఖం. పెద్దలు చూపించిన అమ్మాయినే మనం చేసుకోవాలి.
" కేవలం మనం ఇష్టపడేవారిని అన్నీ కుదిరితే ప్రేమించి పెళ్లి చేసుకుంటాం. కానీ మన జీవితంలో ఇటు మనకు తెలియకుండా అటు, వారికీ తెలియకుండా, మన ఇద్దరి జీవితాలని ముడిపెడ్తాడు ఆ దేవుడు.
మనల్ని నిజంగా ఏ స్వార్ధం లేకుండా మన దగ్గరినుండి మరేమి ఆశించకుండా నిండు మనసుతో ప్రేమించేది
మన "జీవితభాగస్వామి" ఒక్కరే.
కనుక మిత్రులారా, పెళ్ళైన తర్వాత మీ లైఫ్-పార్టనర్ ని జాగ్రత్తగా, స్వచ్ఛమైన ప్రేమతో, ఏమాత్రం బాధపెట్టకుండా చూసుకోండి.
అదే మీ, వారి జీవితాలలో ఇచ్చుకోబోయే గొప్ప "బహుమతి".
ఇట్లు,
మీ శ్రేయోభిలాషి
సాయి ✍️
You havrva good future on writing...develop more through deep writings..
ReplyDelete