The message from whom it is, is the message that will change our lives.

 "ఎవరిని నుంచి వచ్చే సందేశమైన, మన జీవితాన్ని మార్చే సందేశమే".

ఈ భూమి మీద ప్రతి మనిషికి ఏదొక బలహీనత ఉంటుంది. అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు. అది ఏదైనా సరే, ఎక్కడ కూడ మన స్థానాన్ని మనం కోల్పోవద్దు. బలహీనత బలంగా మార్చుకుంటే ప్రతి ఒక్కరు విజయం సాధించగలరు. ఆత్మవిశ్వాసం, నేను సాధించాలి అనే పట్టుదల ఉన్నవారే జీవితాన్ని గెలవగలుగుతారు.

    కాళ్ళు, చేతులు, కండ్లు అన్నీ ఉండి కూడ చిన్న-చిన్న కష్టాల్ని బూతద్దంలో చూసి ఎంతో ఫీల్ అయిపోతుంటాము. కాని, శారీరకంగా ఎదుగుదల లేకపోయినా మానసిక ధైర్యంతో 'నువ్వు చాలా గొప్పవాడివి' అని అనిపించుకునేలా వారి-వారి జీవితాల్ని గెల్చుకున్నారు కొందరు మహానులు. వీళ్ళ కష్టాల ముందు, మన కష్టాలు కాలు గోటితో కూడ సమానం కావని మనకు తెలుస్తుంది. 

     మనం ఎలా ఉన్నా, మనం ఆలోచించే ఆలోచనలు పెద్దవిగా ఉండాలి. మనం కనే కలలు పెద్దవిగా ఉండాలి. 

మన పైన మనం పెట్టుకునే నమ్మకాలూ కొండంత ఉండాలి. అప్పుడే, మనకచ్చే ఫలితాలు, విజయాలు కూడ పెద్దవిగా మనకళ్లముంగటవుంటాయ్.

   కొన్నిసార్లు మనం గెలుస్తాం. ఇంకొన్నిసార్లు ఓడిపోతాం. కాని అదే ప్లేస్లో ' మనం ఓడిపోలేము. దీన్నుండి ఏదోకటి నేర్చుకున్నాము ' అని ఆలోచిస్తే మన జీవితం ఎంతో గొప్పగా ఉంటుంది. ఇక వికలాంగుల జీవితాలకి వస్తే, వారి వైకల్యం శరీరానికి ఇబ్బంది పెడితే,  ప్రతీ చిన్న పనికి మరొకరి సహాయం అడగాల్సి రావడం, వారి మనసుల్ని గురిపెట్టినట్లు అవుతుంది.

     ఆ రెండిటితో నిత్య పోరాటం చేస్తూనే తమ కాళ్ళ మీద తాము నిలబడాలనే ఆరాటంతో బయటికి వస్తే;

బడి,గుడి,బ్యాంక్,పార్క్,ఎక్కడా వారికి అనువైన దారి ఉండదు. ఇంట, బయట ఇన్ని కష్టాలని ఎదురుకుంటూనే విధికి ఎదురేగి విజేతలుగా నిలిచి,తమ లాంటి వారెందరికో స్ఫూర్తిగా నిలుస్తూ, ధైర్యాన్ని అందిస్తున్నారు. 

   ప్రపంచ జనాభాలో దాదాపు 15 శాతం మంది అంగవైకల్యంతో బాధపడుతున్నారు. వారిలో కొందరు అంగవైకల్యం కలిగినవారైనా ఆత్మవిశ్వాసంతో, ఎన్నో గొప్ప స్థానాలను అధిరోహించారు. అన్నీ ఉన్నవారు మాత్రం ఏమీ సాధించలేక, ఇంట్లో పడి అమ్మ-నాన్నల కష్టంతో ముప్పూటలా తిని, గురుకపెడ్తున్నారు. ఈ విషయంలో అన్నీ ఉన్నా వీళ్ళు గొప్పోళ్ళ, లేదా ఏమీ లేని వారు గొప్పోళ్ళ? ఈ ప్రశ్న మీ అందరికే వదిలేస్తున్నాను.... ఇక సెలవు... 🙏

         ఎప్పటికీ ఓ విషయం గుర్తుపెట్టుకోండి," మన జీవితాలనేవి ఈ ప్రపంచానికి మనమిచ్చే సందేశాలు లాంటివి. అది ఇతరులకు స్ఫూర్తిని అందించేలా చూసుకునే బాధ్యత మనది. "👍

                                                           ఇట్లు,

                                                   మీ శ్రేయోభిలాషి, 

                                                         సాయి ✍️

Comments

  1. Yeah, in our society people are insulting and discriminating handicapped people.people should get awareness on them and help as much as they can to the disability persons in our society.

    ReplyDelete

Post a Comment

Popular Posts