మనిషి ఆశలు, బాధ్యతలు మరియు అతని యొక్క కర్మ!

 బోర్ అనిపించినా, సమయం వృధా అనిపించినా, చచ్చేదాకా ఉండేది ఇదే!


జీవితం :- 

    మనిషిలా పుట్టద్దు పుట్టద్దు అని అనుకున్నాం " పుట్టేసాం "

   పుడితే, ఏ చింతా లేని కుటుంబంలో పుడ్దాం పుడ్దాం అని అనుకుంటాం " పుట్టం "

   పుట్టినా, ఏ బాధ రావద్దు, ఏ కష్టం చేరద్దు అని నిత్యం తపిస్తాం " వస్తయి "

   వచ్చినా, మనకు అంటకూడదు, మన చెంత చేరకూడదు అని దురాశిస్తాం " చేర్తాయి "

   చేరిన, తీర్చేయాలి తీర్చేయాలి అని అనుకుంటాం, కాని చేయం, " చేయలేం ". 

నిజంగా జీవితంలో నిజాయితీగా జీవిస్తే, తెలిసేవి ఇవ్వే :-

> చదువు రావాలంటే రాదు, మిగితావి వద్దనుకున్నా వస్తయి. 

> డబ్బులు రావాలంటే రావు, అప్పులోళ్లు మాత్రం కొంపకస్తరు.

> సంతోషాలు రావాలంటే రావు, బాధలైతే తన్నుకుంటొస్తాయి. 

   ఇగ జనం జోలికస్తే, ఇదిగో వీరిలా :-

( అమ్మ ) - శిశువును > మోస్తుంది 

                 జీవితాన్ని > ఇస్తుంది 

                 ప్రేమను > పంచుతుంది 

              స్వార్థం > తన చెంతకే రాదు 

   ఆనందం  > తనకి రాకున్న కుటుంబానికిస్తుంది 

 బాధ > తనకొచ్చినా తనతోడుండే వారికి రానివ్వదు 

                 కుటుంబానికి > ఆదర్శం 

మనకు > ఎల్లకాలం సంతోషాన్నిచ్చే, నిత్యం ప్రేమను పంచే నిస్వార్ధపు మనిషి. 


 ( నాన్న ) - ఎలా నడవాలో, ఎలా నడుచుకోవాలో నేర్పించేవాడు. 

           తోడు, నీడ అంతా తానై నిల్చేవాడు. 

                 కుటుంబానికి దివిటివాడు. 

మనకు => నిత్యం బలాన్ని చేకూర్చే ఒక కఠినమైన సున్నిత మనసున్నోడు. ఎంత ప్రేమున్నా బయటికి చాటుకోలేని ఒకే ఒక్క మొనగాడు. అసలు సిసలైన పౌరుడు. 


( తోబుట్టువులు ) - కుటుంబంలో,, 

            జీవితాన్ని, ప్రేమల్ని, అనుబంధాల్ని, సంతోషాల్ని, ఆప్యాయతల్ని, అనురాగాల్ని, కోపాల్ని, గొడవల్ని, బాధల్ని, కష్టాల్ని, నష్టాల్ని, సుఖాల్ని, ద్వేషాల్ని పంచుకునే, తోడుగా నిల్చే, రామునిచే సైతం వక్తించబడిన మన జీవిత " వాటాదారులు ".

 [ రాముడు చెప్పినది :- ]

  { భార్యలు ఏ దేశంలోనైనా దొరుకుతారు, బంధువులు కూడా అంతే ! కానీ ఏ దేశానికి వెళ్లినా తోబుట్టువులు మాత్రం దొరకరు. వారిని కోల్పోకూడదు. }


( బంధువులు ) - డబ్బులుంటే అస్తరు, కష్టముంటే రారు. వారి అవసరముంటే తీర్చుకుంటారు, మన ఆవసరాలనైతే తీర్చరు. 


( స్నేహితులు ) - ఉండేంతవరకు మంచిగనే ఉంటరు. 

ఉండాల్సినప్పుడైతే ఉండరు. ( ఇదే వీరితో వచ్చే బాధ. )


( ఉపాధ్యాయులు ) - దారెలా ఉంటదో చూపిస్తరు. 

దార్లో మాత్రం మనతోడుండరు. ఏమన్నంటే అది మన బాధ్యత అంటరు. 


( సన్నిహితులు ) - నిత్యం మనల్ని ఎలా ముంచాలో చూస్తరు. 

అలా..... పై-పై ఉండేవారు మాత్రం కొంచం మంచిని కోర్తరు. 


( ప్రియురాలు ) - తెల్వకుండ పరిచయమవ్వుద్ది. 

                         డబ్బులనంత లాగేసుకుంటుంది. 

                          సమయాన్నంత వృధా చేస్తుంది. 

                          స్నేహితులనంత దూరం చేస్తుంది. 

                              ముందు బానే ఉంటుంది. 

                              మధ్యలో చెలరేగిపోతుంది. 

                       చివరికి, వీడి ఒంటరిని చేసిపోతుంది. 

జీవితాన్ని అల్లకల్లోలం చేసి, ఒక ఆశంటూ లేకుండా చేసి జీవితంనుంచి శాశ్వతంగా బంధాన్ని తెంచేస్తుంది... మనల్ని ముంచేస్తుంది...

 ( భార్య గురించి చెప్పలేదే అని అనుకోకండి. మనకింక పెళ్లి కాలేదు. ఏదైనా జరిగితే గాని అర్థంకాదు, అనుభవంమవ్వదు. కనుక, చెప్పదల్చుకోలే. )

పైనున్నవారందరి గూర్చి చెప్పింది సుత్తి కొట్టడానికి కాదు.  

వారేంటో, ఎలా ఉంటారో అని చెప్పా ! నానుండి ఆశగా మీకేదో తెలియజేయాలని.

ఏదో తెలియజేసేది ఇదే :- 

    పచ్చిగా చెప్పాలంటే, వారందరు మన జీవితంలో ఒక భాగమే. ఆ భాగమనేది మన జీవితంలో ఎక్కడుంటుందో తెలీదు. తెలియని దాని గురించి అన్వేషనేందుకు? అది శాశ్వతం కూడా కాదు ! ముందు, మధ్య, చివర అంతా ఉండేది, నిల్చేది, బ్రతికేది, చచ్చేది 

                                                 { " మనమొక్కరమే " }

    ఎవ్వరూ మన తోడుండబోయేది లేదు. మనతో కలిసి జీవించబోయేది లేదూ.... అందుకే, జీవితంలో ఎవ్వరిపై అంటే ఎవరిపైన ఆశలు, నమ్మకాలను పెట్టుకోకపోవడం మంచిది. ఇతరుల పై అవేవో పెట్టుకునే బదలు మనకుపయోగపడే వస్తువుల పై గాని, లేదంటే ముఖ్యంగ మన పై మనం కానీ పెట్టుకుంటే చెప్పలేనంత మంచిది !! 

      ఇదంతా చదువుతుంటే ఏదో స్వార్ధమున్నదని అనుకోవచ్చు. కాని, ఇదే ఏ ఒక్కరికి తెలియని, తెలిసినా లోపల్నే దాచుకునే " అచ్చమైన పచ్చి నిజం ".

    *       నీ జననం నీదే, నీ మరణం నీదే. 

              నీ ఆశలు నీవే, నీ కష్టాలు నీవే. 


           నీ సంతోషాలు నీవే, నీ బాధలు నీవే. 

      నీకిచ్చిన జీవితం నీకే, నీకుండే బాధ్యత నీదే. 

              నీ  తృప్తి - సంతృప్తి అంతా నీదే. 

            నీ చట్టాలు నీవే, నీ నియమాలు నీకే.

    ( ధర్మం అందరికి ఒక్కటే. అది మాత్రం తప్పదు. )

      ఎవ్వరూ చూడలేని నువ్వు కార్చే కన్నీళ్లు నీవే...

        ఎవ్వరూ అర్ధం చేసుకోలేని నీ జీవితం నీదే...

                                             నీ బతుకు ఇగింతే !!!


                                                         ఇట్లు, 

                                                 మీ శ్రేయోభిలాషి, 

                                                      సాయి ✍🏻




Comments

Popular Posts