Akka... Nannu nilabettina needa!


 అక్కా… నన్ను నిలబెట్టిన నీడ!




నాన్నతో పాటు భారం మోసిన నీ భుజాల్ని,

ఇంట్లో ప్రతి గోడకి వినిపించే నీ పిలుపుల్ని,

నిత్యం మా కోసం మోసిన బాధల్ని,

ఎక్కడా బయటపెట్టని నీ కన్నీళ్లను,

నువ్వు చెప్పకున్నా నేను చూసాను అక్కా...


నువ్వు నడిచిన ప్రతి అడుగూ బాధల బాటైనా,

నా ఎదుగుదల కోసం నువ్వు నిలిచావు...

నీ కోరికల్ని పక్కనబెట్టి,

నా ప్రతి కల నెరవేరేలా చూసావు...


నా ప్రతి తడబాటుకి నీ చేయి అండగా,

నా చిన్న చిన్న గాయాలకు నీ మాటే మందుగా,

అదే కళ్లల్లో అలసట కనిపించినా,

నా కోసం నవ్వే నువ్వు...

నా ప్రతి తప్పును సరి చేసేందుకు,

ప్రతి సారి నన్ను దగ్గరకు తీసుకునే నువ్వు...


నువ్వు నాకెంతో అన్నానంటే...

ఈ జీవితం తల్లితో మొదలైతే,

నీ ప్రేమతోనే సాగుతుందని చెప్పగలను...!


                                                                - నీ బర్రోడు 🙃




For The Special Readers:




Comments

Popular Posts