Chinni Matalu (4) 🙃✨
{ కథలో... }
నీ జ్ఞాపకాలలో నేను…
మౌనంగా దూరమైన నీ నీడే,
ఇంకా నా వెనుక నడుస్తూనే ఉంది...
నీ జాడ కోసం నేనెంత వెతికినా,
నీ స్పర్శల సాక్షిగా నిలిచిన గాలే,
నన్ను తాకి వెళ్ళిపోతూ ఉంటుంది...
ఒక్కసారైనా వెనక్కి తిరిగి చూడు,
నా కళ్లలో మిగిలిన నీ జ్ఞాపకాల్ని చూసి,
నువ్వు తడిసి పోవేమో...
కలలోనైనా నా చేతిని పట్టుకుని,
"ఇక దూరం కావను" అని ఒక్కసారైనా అనగలవా...?
ఈ హృదయం ఇప్పటికీ అదే మాట కోసం,
ప్రతి నిమిషం తపిస్తూ ఎదురుచూస్తోంది...
రాత్రి నిద్రలోనూ, రోజు వెలుతురులోనూ,
నీకై నాలో నిశ్వాసగా మిగిలిపోయానా...
ఈ తలుపు ఇప్పటికీ తెరిచే ఉంది,
నువ్వొస్తావన్న నమ్మకమే,
ఇంకా దీన్ని మూసివేయనివ్వడం లేదు...
ఎక్కడ ఉన్నా, ఎప్పుడైనా,
నువ్వు మరిచిపోయినా,
నా ప్రేమ మాత్రం...
నిన్ను వదిలిపోదు...!!
- చిన్ని 🫠
For the Special Readers:
Comments
Post a Comment