Nannaku theleeni matalu 🫠✨
నాన్నకు తెలీని మాటలు...
నాన్నా...
నీ చేతుల చెమటతో పెరిగిన నన్ను,
నీ నీడలోనే నా రూపం మరిచిపోయాను.
నీ బరువును చూసి మాటలు మింగేసాను,
నీ బాధను చూసి కోరికలు మర్చిపోయాను.
నీ పాదాల నడక లోపలి గాయాలైపోయినా,
నీ కన్నుల్లో అలసట మాత్రం దాగలేదు.
నా ప్రతి కోరిక ముందు… నీ చేతిలో రూపాయి లెక్కైంది,
నా ఆనందం కన్నా… నీ బాధలే ముందొచ్చాయి.
ఈ రోజు నీ కష్టంతో బ్రతుకుతున్నాను...
ఒక రోజు నీకు విశ్రాంతి తీసుకురావాలని ఉంది...
ఒక్కసారైనా నీ మోకాళ్ల దగ్గర కూర్చొని,
"నాన్నా, ఇక నీ కోసం నేను ఉన్నాను" అనాలని ఉంది...
నువ్వు మోసిన భారాన్ని,
నా భుజాలపై వేసుకుని నడవాలని ఉంది...
నీ కన్నీటి జాడలు చెరిగిపోయేలా,
నీ జీవితాన్ని సంతోషంగా మలచాలని ఉంది...
- నీ నాని...
For The Special Readers:
Comments
Post a Comment