ఆశలు మిగిలే చోట
రసూల్ - రసూల్... ఒకసారి, అనుకోని పరిస్థితుల్లో చాలా దగ్గరి వాళ్ళు అనారోగ్య బారిన పడడం వల్ల హాస్పిటల్ లో అడ్మిట్ చేసాము. అక్కడే డాక్టర్ల సూచన మేరకు 4-5 రోజులు వరకు observation లోనే ఉంచడం జరిగింది. అక్కడ, ఎవరైనా ఒకరు ఇద్దరు నైట్ కూడా ఉండడం తప్పనిసరి. నేను ఉండాల్సి ఒచ్చింది! ఎందుకంటే డాక్టర్, నర్సులు... పేషెంట్కి ఎప్పుడు ఏం అవసరం ఒచ్చిన అందుబాటులో ఉండడానికి. మాతో పాటే రసూల్ అనే పేషెంట్ ని అడ్మిట్ చేసారు. అతని భార్య పేరు కూడా రసూలే! వాళ్ళ ఊరు నందిమేడారం అంటా! అయితే, రసూల్ అనే వ్యక్తికి హాస్పిటల్ లో జాయిన్ చెయ్యక ముందు, ఒక రెండు రోజుల ముందునుండి ఉన్నపలంగా తిన్నది తిన్న విధంగానే వాంతి చేసుకోవడం మొదలుపెట్టాడు. అస్సలు ఏ ఆహారం తీసుకున్న శరీరం దాన్ని అనుమతించట్లే. ఏమైందో ఏమో అని తన భార్య... "రసూల్" ని ఈ హాస్పిటల్ లో అడ్మిట్ చేయించింది. దురదృష్టం ఏంటంటే వారికి పిల్లలు లేకపోవడం. వారుంటే ఒక అండలా నిలిచేవాళ్ళు. ఆపదిలో వారిద్దరిని ఆదుకోవడానికి వారి చుట్టాలు కూడా ఎవ్వరు రాలేకపోయారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే తినడానికి అన్నం ఉండేది కాదంటా సరిగ్గా. బియ్యం కొందామంటే చేతి...